రాజీవ్ గాంధీ హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం పెరారివాలన్‌ను విడుదల చేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పెరారివాలన్‌ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.