రాజీవ్ హత్యకేసు ముద్దాయిల విడుదలకు.. గవర్నర్ అనుమతివ్వాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిల విడుదలకు రాష్ట్ర గవర్నర్ అనుమతివ్వాలని పీఎంకే డిమాండ్ చేసింది. నళిని, మురుగన్, పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేసేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతిని జారీ చేయాలని పీఎంకే సర్వసభ్య మండలి సమావేశం డిమాండ్ చేసింది. చేపాక్ స్వామి శివానందశాలైలోని అన్నా అరంగంలో జరిగిన ఈ ప్రత్యేక సర్వసభ్యమండలి సమావేశానికి పీఎంకే అధ్యక్షుడు జీకే మణి అధ్యక్షత వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ పాల్గొన్నారు.