PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు గురువారం నాడు పాఠశాల కరస్పాండెంట్  యం.రామేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్,  రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని   సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అని సోదరీ తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా,  తాను అన్నకు అండగా ఉండాలని  సోదరి కట్టిన రక్షాబంధాన్ని  స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తారని. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఏటా పాఠశాలలో జరపడము చాలా సంతోషంగా ఉంది అని ప్రధానోపాధ్యాయులు యం. రామేశ్వర రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ యం. బి. యన్. రాఘవేంద్రరావు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author