ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాయచోటి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు .అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్ కొండయ్య గారు జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ ,చికెన్ గునియా ,మెదడువాపు, బోదకాలు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలి మరణాలు కూడా సంభవిస్తాయని ,దోమలు పెరగకుండా, దోమలు కుట్టకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు .జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ,ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ,ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని కోరారు .ఈ ర్యాలీ స్థానిక ఏరియా హాస్పిటల్ నుండి ప్రారంభమై నేతాజీ కూడలి మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం బస్టాండ్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేసి మలేరియా నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు .దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు దోమతెరలు వాడండి, దోమకాటు నుండి రక్షణ పొందండి ,వేపాకు పొగ దోమలకు సెగ ,నిల్వ నీరు దోమలకు నిలయం లాంటి స్లోగన్లతో ర్యాలీ కొనసాగింది .ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.యం.హెచ్.ఓ.డాక్టర్ మధుసూధన్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది,మలేరియా సబ్ యూనిట్ అధికారి జయచంద్ర ,సిహెచ్ఓ నారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, సూపర్వైజర్ వెంకటేశ్వర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కళందర్ ,టీబీ సిబ్బంది నగేష్ ,ఉత్తమ్ రెడ్డి మరియు రాయచోటి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.