NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉక్రెనియ‌న్ కు రామ్ చ‌ర‌ణ్ ఆర్థిక స‌హాయం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు రస్టీ అనే ఉక్రెయిన్‌ బాడీగార్డుగా వ్యవహరించాడు. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పుట్టినగడ్డను కాపాడుకోవడానికి అతడు సైనికుడిగా మారాడు. ఈ సందర్భంగా హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ రస్టీ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కష్టాలతో సతమతమవుతున్న రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రామ్‌చరణ్‌. ఇందులో అతడు మాట్లాడుతూ.. ‘నా పేరు రస్టీ, ఉక్రెయిన్‌ నా స్వస్థలం. కీవ్‌లో షూటింగ్‌ జరిగినప్పుడు రామ్‌చరణ్‌కు బాడీగార్డుగా పని చేశాను. రష్యా రాకెట్‌ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోతున్నారు. ఈ విషయం తెలిసి రామ్‌చరణ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎలా ఉన్నారు? కుటుంబం క్షేమంగా ఉందా? అని అడిగారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. అలాగే డబ్బులు పంపించారు. దానితో నా భార్యకు మందులు తీసుకున్నాను. థ్యాంక్‌యూ రామ్‌చరణ్‌’ అని చెప్పుకొచ్చాడు.

                                    

About Author