PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వరలోనే రామ్‌ చరణ్‌, శంకర్‌‌ల మూవీ

1 min read

సినిమా డెస్క్​: రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్ చరణ్, తన నెక్స్ట్ మూవీని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నానని ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ ఇంకా రాలేదు. అందుకు కారణం శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాపై ఇంకా క్లారిటీ రాకపోవడమే. తమ సినిమా కంప్లీటయితేనే తప్ప శంకర్ మరో సినిమా చేయకూడదని లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టులో కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చరణ్‌ సినిమా హోల్డ్‌లో పడింది. అయితే ఇటీవల ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో ఈ ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ అయింది. దీంతో అతి త్వరలో రామ్ చరణ్‌ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు శంకర్. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ‘ఆర్​ఆర్​ఆర్​’ సినిమాలో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ వీలయినంత త్వరగా తన పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు. ఈనెల ఆరు నుండి ‘ఆచార్య’ మూవీ షూట్‌లో చరణ్ జాయినవబోతున్నట్టు తెలుస్తోంది. చరణ్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేశారని.. సినిమాలో అది తన ఎంట్రీ సీన్‌ అని అంటున్నారు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి, నక్సలిజం బ్యాక్‌డ్రాప్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌. ఈ రెండు చిత్రాలూ పూర్తయితే రామ్ చరణ్.. అతి త్వరలో శంకర్ సినిమాని కూడా స్టార్ట్ చేస్తాడట.

About Author