NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్.. త్వ‌ర‌గా చనిపోవాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏ పండుగ‌కి విషెష్ చెప్ప‌ని రామ్ గోపాల్ వ‌ర్మ‌.. సంక్రాంతి పండుగ‌కు విషెష్ తెలిపారు. “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్‌ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి'. 'భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.' 'చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి.' 'నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.“ అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు.

                                             

About Author