బైలింగ్వల్ మూవీలో రామ్
1 min readసినిమా డెస్క్ : చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’తో పక్కా మాస్ హీరోగా మారిపోయాడు. తర్వాత ‘రెడ్’ మూవీలో మరింత ఊర మాస్లో కనిపించాడు. దాంతో లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లపై దృష్టి పెడుతున్నాడు. తన కొత్త సినిమా విషయంలోనూ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు రామ్. ఆవారా, పందెంకోడి లాంటి చిత్రాలతో తెలుగులో మెప్పించిన తమిళ దర్శకుడు లింగుస్వామి రామ్‌తో సినిమా ప్రకటించాడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతోంది. రామ్ కి ఇదే ఫస్ట్ బైలింగ్వల్ సినిమా. పైగా తమిళంలో కూడా ఇదే ఫస్ట్ మూవీ. లింగుస్వామికి కూడా ఇదే ఫస్ట్ తెలుగు సినిమా. ఈనెల 12 నుండి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నాం’ అన్నారు. హీరోల క్యారెక్టర్స్ మాస్ గా ఉంటూనే, స్టైలిష్ గానూ ఉండేలా డిజైన్ చేయడం లింగుస్వామి ప్రత్యేకత. యాక్షన్ పార్ట్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. పైగా ఇదో మాస్ ఎంటర్ టైనర్ అని చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు మొదలయ్యాయి.