రామసేతు.. ఆధారాలతో చూపించాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : రామసేతు గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామసేతు గురించి మాట్లాడుతుంటే ప్రజలు దాన్ని కల్పితమని అనుకుంటున్నారని, ఆధారలతో సహా దానిని చూపించాల్సిన అవసరం ఉందని మోహన్ భాగవత్ అన్నారు. దేశ ప్రాచీన గొప్పతనాన్ని విద్యావంతులు వెలికి తీసి పుస్తక రూపం ఇవ్వాలని, అలా దేశ చరిత్రలో మరుగున పడిన అనేక అంశాలను విశ్వసనీయతతో ప్రజలకు అందించగలమని ఆయన అన్నారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.