PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాముడు ధర్మ స్వరూపుడు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ధర్మమంటే రాముడు రాముడంటే ధర్మమని విశ్రాంత తెలుగు పండితులు గరుడాద్రి వనజ కుమారి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, రాంబొట్ల దేవస్థానం నందు ఏర్పాటు చేసిన శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు వారు శ్రీరాముడు – ధర్మ స్వరూపుడు అనే అంశంపై  ప్రవచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయ కమిటీ ఛైర్పర్సన్ నగరూరి దీప్తి, కార్పోరేటర్ నగరూరి శ్రీనివాసులు, అర్చకులు గిరిశ్ శర్మ, మహాలక్ష్మీ , కృష్ణ కాంత్, ఆలయ సిబ్బంది పెద్ది శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మల్లేశ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author