PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రామారావు’ కు ఇద్దరు భామలు..

1 min read
దివ్యాన్ష కౌశిక్

దివ్యాన్ష కౌశిక్

సినిమా డెస్క్​ : ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ తిరిగి ఫామ్‌లోకి వచ్చేసి లైనుపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఆల్రెడీ ‘ఖిలాడీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పుడు ‘రామారావు’ ఆన్‌ డ్యూటీ అంటూ జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రవితేజతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ మూవీకి సుధాకర్ చెరుకూరి నిర్మాత. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లట. ఆ ఇద్దరి పేర్లను నిన్న అనౌన్స్ చేశారు. అందులో ఒకరు ‘మజిలీ’తో టాలీవుడ్ కి పరిచయమైన దివ్యాన్ష కౌశిక్. మరొకరు రజీషా విజయన్. ఈమె మలయాళ నటి. ధనుష్ ‘కర్ణన్’ మూవీతో తమిళియన్లను ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో మాస్‌ మహరాజా పక్కన నటించేందుకు చాన్స్‌ కొట్టేసింది. తనకిదే ఫస్ట్ తెలుగు సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యూనిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా నటిస్తున్నాడు.


About Author