‘రంజాన్’.. పేదలకు అన్నదానం..
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా అంతర్జాతీయ మానవహక్కుల కమీషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి షేక్ గుల్జార్ అహ్మద్, షేక్ హపి జాబీ దంపతులు నందికొట్కూర్ పట్టణంలోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రమము నందు నిరాశ్రయులకు ఆదివారము ఉచిత అన్నదానం, వస్త్ర దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ ఉపవాస దినాలను భక్తిశ్రద్ధలతో పవిత్రంగా జరుపుకోవడంతో పాటు సమాజంలోని తోటివారికి అన్నదానం,వస్త్ర దానం చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడడంలో తాము కన్న బిడ్డలు వారి ఆలనా పాలనా చూసుకో క పోవడంతో వారికి తోడ్పాటును అందించేందుకు దాతలు ముందుకు రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మల్లికార్జున రెడ్డి, శేషి రెడ్డి,భాస్కర్ రెడ్డి దంపతులు, జవ్వాజి సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ లాలూ రవిశంకర్ ప్రసాద్, పట్టణ వైసిపి నాయకులు ఉస్మాన్ బేగ్, పాతకోట రమేష్, ఖలీల్ అహ్మద్, జాకీర్, రఫీ, హుస్సేన్ భాషా తదితరులు పాల్గొన్నారు.