మిడుతూరులో భక్తి శ్రద్ధల నడుమ రంజాన్..
1 min read
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మైనార్టీ సోదరులు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని 24 గ్రామాల్లో సోమవారం ఉదయం రంజాన్ పండుగను మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే మైనార్టీ సోదరులు,చిన్నారులు నూతన దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్చి 2న ప్రారంభమైన ఉపవాసాలు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలో పాల్గొన్నారు.ఈద్గాల దగ్గర ప్రార్థనల అనంతరం సోదరులు చిన్నారులు దాన ధర్మాలు చేశారు.మిడుతూరు, కడుమూరు చౌటుకూరు బైరాపురం జలకనూరు అలగనూరు తలముడిపి ఉప్పలదడియ తదితర గ్రామాల్లో ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా పండుగను జరుపుకున్నారు.