ఘనంగా రంజాన్ వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: రంజాన్ పండగను ముస్లింలు మండల వ్యాప్తంగా గురువారం నాడు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మతపెద్దలు మౌలాన రంజాన్ విశిష్టత, అల్లా అనుగ్రహంపై ప్రత్యేక సందేశమిచ్చి, ముస్లింలచే రంజాన్ ప్రార్థనలు చేయించారు. రంజాన్ పర్వదినం ముస్లింలందరికీ అత్యంత ప్రీతికరమైందని, ముఖ్యమైందని వారు పేర్కొన్నారు. పరమత సహనం పాటించి అందరితో సోదరభావంగా మెలగాలని సూచించారు. ఆత్మ సంతృప్తితో అల్లాను ప్రార్థిస్తే కష్టాలన్ని తొలగి శుభం చేకూరుతుందని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మరణించిన తమ కుటుంబసభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.