రంజాన్ ఉపవాసాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్ర మాసం రంజాన్ నెలలో ఐదు పూటల నమాజు చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ కార్యాలయం దగ్గర ఉపవాసం ఉంటున్న జర్నలిస్టులకు నిత్యవసర సరుకులను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రంజాన్ ఉపవాసాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారని కష్టాలు తొలగిపోవాలని నమాజ్ చేయడం మంచిదేనన్నారు. ప్రజలందరికీ బలాన్ని హీనతలను తెలియజేసేందుకు కష్టాలు వస్తాయే తప్ప ఎవరు కష్టాల కు అధైర్య పడవద్దు అన్నారు. ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్ అని , దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అన్నారు. ఉపవాసం రోజులలో మనుషులలో ఓర్పును కోరుకుంటుందని, చెడు విషయాలను చెడు మాటలను తమ దరికి చేరకుండా మనసును అదుపులో ఉంచుకునే భావనను మనో నిగ్రహాన్ని అలవర్చుకోవడం జరుగుతుందన్నారు.