PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన పండుగ రంజాన్..

1 min read

ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ శుభాకాంక్షలు..

రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి.కృష్ణారెడ్డి

మర్యాదపూర్వకంగా కలిసిన

ఏపీ నూరు భాష ముస్లింల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి గాజుల బాజీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లింల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి గాజుల బాజీ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బి వి కృష్ణారెడ్డిని ను కలిసి తెలుగులో అనువదించిన ఖురాన్ మరియు ఖర్జూర పండ్లను పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులు అందరూ ఎంతో పవిత్రంగా, సంతోషంగా జరుపుకునే పండుగ రంజాన్ అని, ఈ సందర్భంగా అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూరు భాషా దూదేకుల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి గాజుల బాజీ, ఏలూరు టౌన్ నాయకుడు వలి భాష తదితరులు పాల్గొన్నారు.

About Author