NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మతసామరస్యానికి ప్రతీక రంజాన్

1 min read

– నందికొట్కూరు లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
– వేడుకల్లో పాల్గొన్న పారిశ్రామికవేత్త హాజీ మహబూబ్ సాహెబ్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త తాటిపాడు హాజీ మహబూబ్ సాహెబ్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రహదారి లో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ ,పారిశ్రామిక వేత్త హాజీ మహబూబ్ సాహెబ్, ఉర్డు అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు , కౌన్సిలర్ జాకీర్ హుసేన్ పలువురు ముస్లిం నేతలు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులు పవిత్ర రంజాన్‌ మాసాన్ని ఎంతో నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారని పేర్కొన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, సోదరభావానికి చిహ్నమైన రంజాన్ పర్వదిన అల్లాహ్ దయతో అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

About Author