త్యాగానికి ప్రతీకగా రంజాన్ పండుగ
1 min read– మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో శనివారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ రంజాన్ వేడుకలలో ముస్లిం పెద్దలు మరియు పిల్లలు రాత్రి నెలవంక కనపడడంతో శనివారం ఉదయాన్నే ముస్లిం సోదరులు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ రంజాను పండుగ ప్రేమ మరియు మానవత్వం అలాగే త్యాగానికి ప్రతీక గా నిలవడం వల్లనే ఈ రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని ముస్లిం పెద్దలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు మరియు పిల్లలు ,పెద్దలు ఒకరిని ఒకరు అలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ముస్లీం మత పెద్దలు,మండల ఖాజీలు కత్తీఫ్ సా, జలీల్, ఎంపీపీ నసురుద్దీన్,మాజీ సర్పంచ్ రహంతుల్లా, డాక్టర్ ఉస్మాన్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్, కారుమంచి షేక్ అహ్మద్, జిల్లా మైనార్టీ నాయకులు బేతాళ బడేసాబ్, ఏపియూడబ్ల్యూజే తాలుకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్,మండల అధ్యక్షులు అక్బర్, షఫీ తదితరులు పాల్గొన్నారు. పండగ సందర్భంగా ఎస్ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.