ముస్లిం ‘ లకు రంజాన్ పవిత్రమైనది…
1 min read
పేద ముస్లిం మహిళలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
కర్నూలు , న్యూస్ నేడు: ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం పరమ పవిత్రమైనదని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రీ ఎస్టేట్ లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కింద నిత్యవసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస ఉండటం వలన వారికి శరీరంపై, మనసుపై నియంత్రణ కలుగుతుందని ,అలాగే ఆధ్యాత్మిక నియంత్రణ కూడా కలుగుతుందని చెప్పారు. ప్రపంచంలోని ప్రతి ముస్లిం సోదరుడు సోదరీమణులు రంజాన్ పర్వదిరాన్ని ఘనంగా జరుపుకుంటారని తెలియజేశారు. ఈ మాసంలో చేసే దాన, ధర్మాల వల్ల వారికి అంతా మంచి జరుగుతుందని తెలిపారు. మనదేశంలో హిందువులు, ముస్లిం లు, క్రైస్తవులు ఏ సామాజిక వర్గమైన ఎవరి ప్రత్యేకత వారికీ ఉందని, ఎవరిని ఎవరు తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి మెలిసి ముందుకు సాగితే ప్రపంచంలో మన దేశం నంబర్ వన్ దేశము గా నిలుస్తుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.