PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింలకు ‘రంజాన్​​’ శుభాకాంక్షలు

1 min read
ముస్లిం సోదరులకు పండ్లు, మిఠాయిలు అందజేస్తున్న గవర్నర్​ బండారు దత్తాత్రేయ

ముస్లిం సోదరులకు పండ్లు, మిఠాయిలు అందజేస్తున్న గవర్నర్​ బండారు దత్తాత్రేయ

– హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ
హిమాచల్​ ప్రదేశ్​: పవిత్ర రంజాన్​ మాసంలో 30 రోజులు కఠిన ఉపవాసదీక్షలు పాటించి.. నెలవంక దర్శనం అనంతరం ఈద్​–ఉల్​–ఫితర్​ వేడుకలు జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్ర గవర్నర్​ శ్రీ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్​ నిబంధనల దృష్ట్యా శుక్రవారం హిమాచల్​ ప్రదేశ్​ రాజ్​భవన్​లో ముస్లిం సోదర సోదరీమణులకు పండ్లు, మిఠాయిలు అందించి రంజాన్​ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు హృదయపూర్వక ​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్​ దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ముస్లింల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, రంజాన్ పండుగ అందరి జీవితాలలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖులకు.. ఫోన్​ ద్వారా శుభాకాంక్షలు
ఈ పర్వదినం సందర్భంగా గవర్నర్​ బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ , కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ , మణిపూర్ గవర్నర్ శ్రీమతి నజ్మా హెప్తుల్లా , తెలంగాణ హోమ్ శాఖమాత్యులు మహమూద్ అలీ , సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖాద్రీ , మాజీ కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్ కి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషా, సిపిఐ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు అజిజ్ పాషా , జాతీయ వక్ఫ్ బోర్డు సభ్యులు హనీఫ్ అలీ, బిజెపి జాతీయ మైనారిటీ మోర్చా నాయకులు లాయక్ అలీ తదితర ప్రముఖులకు, మరియు ఇతర ముస్లిం సమాజ పెద్దలకు చరవాణిలో శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్, క్రికెటర్ సిరాజ్, శాసనమండలి సభ్యులు మహమ్మద్ సలీం, బోధన్ శాసనసభ్యులు షకీల్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ కుమార్ఉద్దీన్, తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి మహిళా సివిల్ సర్వీసెస్ అధికారిని జమీల్ ఫాతిమా గార్లకు కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

About Author