ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రంజాన్ మాసపు ఉపవాస దీక్షలకు, ప్రార్థనలకు చివరి అంకమైన ‘ఈద్-ఉల్-ఫితర్’ సందర్భంగా కర్నూలు నగర ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు కర్నూలు నగర మేయర్, వైయస్ఆర్ సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై రామయ్య గారు శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి అందరిలో నింపాలని , మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని మేయర్ కోరారు.