రామకృష్ణ సూసైడ్ వీడియో.. ఎమ్మెల్యే కొడుకు పై తీవ్ర ఆరోపణలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఇటీవల కుటుంబంతో పాటు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్ర పై సంచలన ఆరోపణలు చేశారు. ` రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేనొక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లల్ని వదలరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పల్లో ఉన్న నా పై నా తల్లి, సోదరి కక్ష సాధించారు
అంటూ సెల్పీ వీడియోలో రామకృష్ణ చెప్పారు.