NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌మ‌ణదీక్షితులు.. వైసీపీలో చేరండి: బీజేపీ

1 min read

పల్లెవెలుగు వెబ్: టీటీడీ ప్రధాన అర్చకులు ర‌మ‌ణ‌దీక్షితుల‌కు జ‌గ‌న్ మీద ప్రేమ ఉంటే వైసీపీలో చేరాల‌ని అన్నారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి. తిరుమ‌ల‌లో అన్యమ‌త ప్రచారం జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న ఎలా స‌ర్టిఫికెట్ ఇస్తార‌ని ప్రశ్నించారు. ర‌మ‌ణ దీక్షితులు వైసీపీ కార్యక‌ర్తా?, టీడీడీ అర్చకుడా? తేల్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. గ‌తంలో పింక్ డైమండ్ ఉంద‌ని, నేల మాళిగ‌లు ఉన్నాయ‌ని చెప్పిన ర‌మ‌ణ‌దీక్షితులు ఇప్పుడెందుకు వాటి మీద మాట్లాడ‌టంలేద‌ని ప్రశ్నించారు. గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పిన త‌ర్వాత ప్రధాన అర్చకుడిగా దేవ‌స్థానంలోకి అడుగుపెట్టాల‌న్నారు. తిరుమ‌లలో అన్యమ‌త ప్రచారం జ‌రుగుతోంద‌ని తాను నిరూపిస్తాన‌ని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ర‌మ‌ణదీక్షితులు వ‌స్తే ఆయ‌న‌కు చూపిస్తామ‌ని తెలిపారు.

About Author