రమణీయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామ శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు.రథోత్సవ కార్యక్రమం గ్రామ సర్పంచి కొంగర నవీన్,ఆలయ ధర్మ కర్త కిరణ్ కుమార్ ,ఈఓ కార్తీక్ ఆధ్వర్యంలో వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు సుబ్రమణ్యం శర్మ స్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఎమ్మెల్యే ఆర్థర్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాల పూల వర్షం తో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుశ్శాసలువలతో ఆలయ అధికారులు ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. రథోత్సవంలో నందికొట్కూరు మండలం నాగటూరు, బిజినేముల,పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్, ముచ్చుమర్రి, పగిడ్యాల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూరు అర్బన్ సీఐ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్.వి రమణ, పాములపాడు ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ చందమాల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు చిన్న పుల్లయ్య, వేణు గోపాల్, విజయ లక్ష్మి, నాగ లక్ష్మమ్మ, రామేశ్వరమ్మ, కళావతమ్మ, సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య, వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్ , రైతు సంఘం నాయకులు, పెద్దమనుషులు రంగస్వామి, చేపల మహేష్,బాలన్న ,బెస్త రాజు,కొంగర దావీదు, దాసరి నాగరాజు,బండారు గోపాల్, నాగన్న, కొంగర అయ్యన్న ,మదారి గోపాల్, మల్లెపోగు చిట్టెన్న, పూజారులు నాగలక్ష్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.