NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న రామాపురం పుణ్యక్షేత్రం

1 min read

భక్తాదులకు కొంగుబంగారమైన దేవతామూర్తులు

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ

కమలాపురం, న్యూస్​ నేడు:  ఈ భువి లో ఎక్కడా లేని విధంగా హరిహర దేవతామూర్తులు శ్రీ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికంధర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన రామాపురం మహా పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల పదవ వ తేదీ నుంచి 14వ  వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండువుగా జరగనున్నాయి. విశిష్ట దేవతామూర్తులైన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా వైశాఖ శుక్ల త్రయోదశి నుంచి వైశాఖ బహుళ విధియ వరకు ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి విగ్రహ మూర్తులు కావడంతో ఈ ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. లంకలో రావణ సంహారం తర్వాత శ్రీరాములు వారు అయోధ్యకు తిరుగు ప్రయాణంలో సీత సమేతంగా ఈ క్షేత్రానికి విచ్చేసి నిద్రించాడని, ఆ సమయంలో రాములవారికి మహావిష్ణువు స్వప్న సాక్షాత్కారమై మోక్షాన్ని ప్రసాదించాడని స్థల పురాణం చెబుతోంది. రాములవారి మనోభీష్టం మేరకు ఈ క్షేత్రంలో మహావిష్ణువు మోక్షావతారంలో వెలిశాడని, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సృష్టిలో ఎక్కడా లేని విధంగా ద్వికంధరుడుగా తన విశ్వరూపంతో వెలిశాడని ఈ క్షేత్ర చరిత్ర చెబుతోంది.  బ్రహ్మోత్సవాలకు ఆలయం విశేషంగా ముస్తాబవుతోంది. ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సేవాకర్తలు గత వారం రోజులుగా బ్రహ్మోత్సవాల విజయవంతం కోసం కృషి చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో ప్రతినిత్యం మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామికి  శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికంధర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి  వివిధ వాహనాలలో ఊరేగింపు ఉత్సవం ఐదు రోజులపాటు అద్భుతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ పూజా సేవలను గుంటూరు పట్టణానికి చెందిన సలక్షణ ఘనాపాటి, వంశీకృష్ణ ఆధ్వర్యంలో వేద పండితులు హోమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆలయ అర్చక స్వాములు జగదీష్ శర్మ, ఆధ్వర్యంలో నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో పూజ సేవకులు చెన్నూరు మండలం రామన్నపల్లెకు చెందిన కలుమడి వెంకటేశ్వర శర్మ కాశీభట్ల శివరామ శర్మ శ్రీధర్ శర్మ నాగేంద్ర శర్మ, దీపక్ శర్మ, సుందర విగ్నేష్ శర్మ రాజు రణీష్, పూజా సేవలు పరివేక్షించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్నప్రసాద సేవా కార్యక్రమాన్ని, ఇటుకలపాటి జనార్దన్ రావు కల్లూరు జనార్దన్ రెడ్డి జంబాపురం చల్లా జయచంద్రారెడ్డి, గుండం వెంకటేశ్వర రెడ్డి, హరి, మహేష్, తదితరులు నిర్వహిస్తుండగా బ్రహ్మోత్సవాల పూల సేవా ఏర్పాట్లను పెళ్లమర్రి మండలం మమ్ము సిద్దిపల్లె కు చెందిన బీసీ ఓబుల్ రెడ్డి నిర్వహిస్తున్నారు గత పది సంవత్సరాలుగా వేలాది మంది భక్తాదులకు కొంగుబంగారంగా వెలిసిన దేవతా మూర్తుల బ్రహ్మోత్సవాలకు జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా విశేష సంఖ్యలోభక్తులు హాజరవుతుంటారు. బ్రహ్మోత్సవాల చివరి రోజున గరుడోత్సవం,మయురోత్సవం అత్యంత కన్నుల పండువుగా నిర్వహిస్తారు. అలాగే వృషభరాజములకు బండలాగుడు పోటీలు, చెక్కభజనలు, తాళ భజనలు, కోలాట నృత్యాలు, డాన్స్ బేబీ డాన్స్ వారిచే ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం, వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ నిర్వాహకులు సేవకులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో, ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు ఆలయ ప్రధాన సేవకులు సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ సేవకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకులు సాయినాథ్ శర్మ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తాదులందరూ విశేషంగా పాల్గొని దేవదేవుల అనుగ్రహం పొంది బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *