వైభవం.. రాముడి పల్లకోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్: వైంకుంఠ ఏకాదశీ (పుష్య శుద్ధ ఏకాదశీ) పురస్కరించుకుని కర్నూలు నగరం లోని మైన్ బజార్ లో వెలసిన ఏకాంత రామాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున శ్రీ సీతా సమేత శ్రీరాముల వారికి నిర్మాల్య విసర్జన, పంచామృతాభిషేకం, అలంకార సేవ చేశారు. అనంతరం శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను కర్నూలు పాత నగరం లోని ప్రధాన వీధులైన పూలబజార్, బొంగులబజార్, షరాఫ్ బజార్,బట్టల బజార్,మించిన్ బజార్,చిన్న మార్కెట్, చిత్తారి వీధి చౌరస్తాల మేడం వీధు ల మీదుగా తిరిగి ఆలయం చేరకుంది…స్వామి వారి ఊరేగింపులో మంగళ వాయిద్యాలు,ఇస్కాన్ సంస్థ భక్తబృందంవారు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ హారెరామ,హరెకృష్ణా అంటూ భగవన్నామ కీర్తనలు చేస్తూ ,ఊరేగింపు కొనసాగింది ఈ కార్యక్రమంలో అర్చకులు మాళిగి జయతీర్థ, వేదవ్యాస్, సత్యప్రియ, సాకేతరామ్,విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,శ్రీమతి భార్గవి,మాజీ కార్పోరేటర్ విఠల్ శెట్టి,చిల్కూరు ప్రభాకర్,నందకిశోర్,లింగం శ్రీనివాసులు,శేషగిరి శెట్టి, అశేష హిందూ బంధువులు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు….