PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీజేఎఫ్ వీడియో, ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా రామస్వామి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం వీడియో, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా రామస్వామి ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక బిర్లా కాంపౌండ్ లోని ఐకాన్ ప్లాజా లో గల జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంకు ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామకృష్ణ, సాయికుమార్ నేతృత్వం వహించగా, రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్,విఐజే శ్రీనివాసులు నేతృత్వంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వీడియో ,ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా మధు సూదన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రాజు, ట్రెజరీ సురేష్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా శ్రీనివాసులు ,సభ్యులుగా శశి, శివయ్య, సీమ కేబుల్ మహేష్, , ప్రసాద్, పల్లె వెలుగు శివకుమార్ తదితరులు ఎంపికయ్యారు.

About Author