NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వరలో రామాయణ యూనివర్శిటీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : అయోధ్యలో త్వరలో రామాయణ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో యూనివర్శిటీ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం మహర్షి విద్యాపీఠ్ ట్రస్టు రూపురేఖలు సిద్ధం చేసింది. శ్రీరాముని జీవితం, సంస్కృతి, గ్రంథాలు లాంటి అంశాల పై యూనివర్శిటీలో అధ్యయనం జరగనున్నాయి. ప్రతిపాదిత యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగం నిర్మించే అవకాశం ఉంది. రామనగరి అయోధ్యలో పరిశోధనల కోసం రామాయణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాలు ఉంటాయని, ఇందులో రామాయణ పరిశోధన, బోధనకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీనితో పాటు హిందీ, సంస్కృత భాషలకు యూనివర్సిటీలో ప్రముఖ స్థానం కల్పించనున్నారు. ఇందులో విద్యార్థులకు వేదం, రామాయణం, ఉపనిషత్తులు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం తదితర అంశాలను బోధించనున్నారు.

     

About Author