ఆనాటి రాంగోపాల్ వర్మ మళ్లీ కనిపించారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై రాజమౌళి తండ్రి, కథారచయిత విజయేంద్రప్రసాద్ పొగడ్తలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ ‘‘కొన్నాళ్ల క్రితం ఓ వేదికపై వర్మను కొన్ని మాటలు అనేశారు. 15 ఏళ్ల నుంచి ఆయనపై నాలో గూడుకట్టుకున్న కోపం, చిరాకు, బాధ అన్నీ కలిపి ఆరోజు ేస్టజ్‌పై అనేశాను. ‘శివ’ సినిమా చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. నాలాంటి వందల మంది రచయితలు, టెక్నీషియన్స్, ఆయన ప్రేరణతో సినిమాల్లో వచ్చారు. ‘అప్పటి వర్మ కనిపించడం లేదు. మీకేమైనా కనిపిేస్త మళ్లీ అలాంటి సినిమాలు తీయమని చెప్పండి’ అని అన్నాను. నాలోని ఆవేశం అలా అనేలా చేసింది. ‘అమ్మాయి’ చూశాక గర్వంగా చెబుతున్నా. ‘రాము గారూ.. మీలో ఆనాటి డైరెక్టర్ మళ్లీ కనిపించారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు’. ఈ చిత్రం చైనాలో 40లకు పైగా స్ర్కీన్స్‌లో విడుదల కావడం అద్భుతమైన విషయం. ఎవరూ సాధించని ఘనత ఇది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరికీ గర్వకారణం’’ అని అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన అమ్మాయి
సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.