బిజినేములలో.. పొట్టేళ్ల పందెం
1 min readపల్లెవెలుగు. నందికొట్కూరు:అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని బిజినేముల గ్రామంలో శ్రీ కాశీ చంద్రమౌళీశ్వర స్వామి తిరుణాల ఉత్సవాల భాగంగా ఆదివారం పొట్టేళ్ల పందెం పోటీలను ఆలయ కమిటీ నిర్వహించింది.ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి రవియాదవ్, కస్టమ్స్ అధికారి వేల్పుల అనంద్ కుమార్, శాప్ నంద్యాల జిల్లా కో ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్ హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీలకు పొట్టేళ్ల హోరాహోరీగా తలపడ్డాయి. పోటీల్లో గెలుపొందిన పొట్టేళ్ల యజమానులకు గ్రామ సర్పంచి రవియాదవ్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొదటి బహుమతి పి. వెంకటరమణ (ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్) బిజినవేముల రూ.10,000, నందికొట్కూరు సహకార సంఘం సీఈఓ మొల్ల రబ్బాని రెండవ బహుమతి రూ.8,000, .మూడవ బహుమతి రూ.6,000 శ్రావణ్ మరియు తిరుమలేష్, నాల్గోవ బహుమతి రూ. 4,000 గొల్ల సవారి కుమారులు విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీవి కిరణ్ రెడ్డి, మధు యాదవ్, వైసీపీ నాయకులు సురేష్, గ్రామస్తులు రమణ గౌడు, అమర్ నాథ్ ,పరమేష్, యాకూబ్ బాష, లోకేష్, బోరు బాష, ఈడిగా మద్దిలేటి, శంకర్ గౌడు, బాలకృష్ణ, పాల శ్రీరాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.