రాముడి వంతెన రాళ్లు అంటూ.. రూ. ఐదు వేలకు అమ్ముతున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమ్మకానికి అనర్హం ఏదీ కాదంటూ అమ్మేస్తున్నారు అక్రమార్కులు. నిషేధిత స్పటిక రాళ్లను ‘రాముడు వంతెన నిర్మాణానికి వినియోగించిన రాళ్లు’ అంటూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. 20 గ్రాముల రాయి రూ.5 వేలకు విక్రయిసుౖన్నట్టు తెలిసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు అటవీ శాఖ హెచ్చరించింది. రామనాధపురం జిల్లా మన్నార్ వలైకుడ, పాక్ జల సంధి ప్రాంతంలో వేలాదిగా స్పటిక రాళ్లు దర్శనమి స్తుంటాయి. ఈ రాళ్లకుండే పాచి మధ్య సుమారు 500 రకాల సముద్రపు జీవులు నివసిస్తుంటాయి. చేపలుపట్టే సమయంలో వలలు తగిలి, కొందరు విక్రయాల కోసం తవ్వేస్తుండడంతో సముద్రపు జీవులకు ఇబ్బంది కలుగు తోంది. ఇందుకోసం ఈ రాళ్ల విక్రయాలపై నిషేధం విధించిన ప్రభుత్వాలు, వీటిని రక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాముడి వంతెన నిర్మాణం కోసం వినియోగించిన రాళ్లు అంటూ ఆన్‌లైన్‌లో స్పటికం రాళ్ల విక్రయాలు జరుగుతున్నాయి.