మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: నెలరోజులపాటు నిష్టతో ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు శుక్రవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఢిల్లీ జామియా మసీదు కమిటీ మత పెద్దలు.ప్రకటించడంతో శనివారం నాడు రంజాన్ పండుగ కోలాహలం ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల నమాజు ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలపడంతో రంజాన్ పండుగ మాసం ముగిసింది మండలంలోని అన్ని మసీదులలో ఈద్గాలలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్ధనలు 9:30కు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసాయి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఆవిర్భవించిన కాలాన్ని రంజాన్ మాసంగా ముస్లిం సోదరులు జరుపుకుంటారు ప్రవక్త సూచించిన ముస్లిం సంప్రదాయ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కు బయలుదేరడానికి ముందు ప్రతి ముస్లిం జకాత్ మరియుఫిత్రాలను పేద ముస్లిం కుటుంబాలకు ఆలిం కోర్సు చదివే పేద విద్యార్థులకు మదర్సాలకు ఇవ్వడం తప్పనిసరిగా పాటిస్తారు.