మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ – టిడిపి నేత
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు . శుక్రవారం అన్నయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె, నీలిపల్లి, టంగుటూరు గ్రామాల్లో ఆయన రంజాన్ తోఫాను ముస్లిం సోదర,సోదరీమణులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులకు పండుగను ఘనంగా సంతోషంగా జరుపుకునే దానికి ప్రతి రంజాన్ పండుగ రోజు చౌక దుకాణాల ద్వారా చంద్రన్న రంజాన్ తోఫాను పంపిణీ చేసేవారని అదే స్పూర్తితో రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 4 వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో అయన వెంట రాష్ట్ర బీసీ నాయకులు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాడపూరి హేమలత, తోట శివశంకర్, షేక్ నూరుల్లా, కల్లూరు సుబ్బరాయుడు, రియాజ్, కాజా, పీరా, జుల్ఫికర్,షఫీఉల్లా, ఫయాజ్,సతీష్ రాజు, శేషారెడ్డి, వెంకటేష్, సూర్యరాజు, రాజేష్ వర్మ, వినోద్ రెడ్డి, రాజశేఖర్, తోటమల్లి, ఆది సురేష్ తదితరులు పాల్గొన్నారు.