NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీన్ ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు రంజాన్ తోఫా

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ‘ స్టేట్ జాయింట్ సెక్రటరీ, మరియు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం లో తన సంస్ధలో ఉద్యోగం చేస్తూన్న కార్మికులు అందిరికీ సుమారు 500 మందికి కొత్త బట్టలు, స్వీట్స్ కానుకలు ఇవ్వడం జరిగింది.ప్రతి సంవత్సరం కార్మికులకు రంజాన్ పండుగ సందర్బంగా కానుకలు ఇవ్వడం ఎంతో సంతోషoగా ఉందని అమీన్ అన్నారు.అనంత కరుణ మయుడుఅల్లహ్ దీవేనలతో బీదవారికి మరియు కార్మికులకు మా వంతుగా గత కొన్ని సంవత్సరాలుగా సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మానవతావాదిగా ‘ తోటి మనిషికి సాయం చేయడమేపవిత్ర ఖురాన్ లోని సందేశం అని వివరించారు. త్యరలో ఛారిటబుల్ ట్రస్ట్ ద్వార మరిన్ని సేవ కార్యక్రమలు చేస్తామని తెలిపారు.

About Author