ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు నందు ఎరువుల దుకాణాలను శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు బద్వేల్ వ్యవసాయ డివిజన్- సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజ ఆకస్మిక తనిఖీ చేసి పలు రిజిస్టర్ లను, రశీదులను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన దుకాణ యజమానులతో మాట్లాడుతూ ఇన్వాయిస్, బస్తా తూకం, లైసెన్స్ గడువు వంటి అంశాలపై ఆయన దుకాణ యజమానులతో మాట్లాడి వాటిని చూడడం జరిగింది, పిదప వారికి ఆయన పలు సూచనలు చేయడం జరిగింది, కోనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పని సరిగా రశీదు ఇవ్వాలని రైతు సంతకం, మొబైల్ నంబర్ తప్పక సేకరించాలని తెలిపారు, అలాగే నాణ్యమైన ఎరువులను మాత్రమె అమ్మాలని తడిసిన,గడ్డ కట్టిన ఎరువులని ఎట్టి పరిస్థతుల్లోనైనా అమ్మరాదని వారికి తెలియజేశారు,గరిష్ట అమ్మకపు ధరకు మించి అమ్మ రాదనిరైతుకు అవసరమైన ఎరువులను తప్ప వేరే ఎరువులను లింక్ చేయరాదని తెలిపారు, కోనుగోలు సమయం లో ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన కల్పించాలని కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా వేయరాదని రైతులకు సూచించాలని ఆయన వారికి తెలిపారు. ఎరువుల నియంత్రణ చట్టం ,1985 నిబంధనలకు లోబడి చట్ట బద్దమైన వ్యాపారం చేయాలని స్టాక్ వివరాలు, అమ్మకపు ధర షాప్ ముందు భాగంలో బోర్డుల రూపంలో ఉంచాలనిలేనిచో చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు,ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, రైతు భరోసా కేంద్ర సహాయకులు చరణ్ పాల్గొన్నారు.