NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికల సంక్షేమ వసతి గృహల ఆకస్మిక తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు బి.కాంప్ నందు బి.సి., ఎస్.సి. కాలేజీ బాలికల సంక్షేమ వసతి గృహలను ఆకస్మిక తనిఖీని నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు సోమవారం   జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు  కర్నూలు బి.కాంప్ నందు బి.సి., ఎస్.సి., కాలేజీ  బాలికల సంక్షేమ వసతి గృహలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించినారు. ఈ సంక్షేమ హాస్టలును సందర్శించి ఆ హాస్టలులోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు , జిల్లా బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి పి.వెంకలక్ష్మమ్మ ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొనారు.

About Author