సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం కలుదేవకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మంత్రాలయంలో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జన్మనిచ్చిన ఏ తల్లి చనిపోకూడదు,జన్మించిన ఏ శిశువు మరణించకూడదు అనే నినాదంతో ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలా ప్రోత్సహించాలని తెలియజేశారు. గర్భిణిలకు పోషకాహారముపై,రక్తహీనతపై ,ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించినారు.ముఖ్యంగా చిన్న పిల్లల్లో నిమోనియా,తక్కువ బరువుతో పుట్టడము, ,శ్వాసఆడకపోవడము,శరీర ఉష్ణోగ్రతలు సక్రమంగా ఉండకపోవడము,పోషకాహార లోపంతో బాధపడేవారికి కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని పౌష్టికాహార పునర్వాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఈ కార్యక్రమములో వైద్యులు డాక్టర్. గోవిందమ్మ . సామాజిక ఆరోగ్య అధికారి జయంతి, ఆరోగ్య కార్యకర్త సుజాత, ఆశా కార్యకర్త సుజాత మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.