సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మే 8వ తేదీన ఉదయం 10 గంటలకు నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దిన్న దేవరపాడు గ్రామంలోని బి. సి. కాలనీ లొ జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బిడ్డకు బిడ్డకు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరముల వరకు ఎడమ ఉండుట మంచిది. ప్రసవ సమయంలో తల్లికి రక్తస్రావం ఉండడం వలన మరల శరీరం రక్తం పుంజుకొని సంసిద్ధత వచ్చేవరకు ఎడమ అవసరమని తెలిపారు. అదేవిధంగా శిశువు పాలపోషణకు కూడా రక్తం అవసరం ఉంటుంది కనుక మొదటి బిడ్డకు రెండు సంవత్సరములు నిండిన తరువాతనే రెండవ బిడ్డకు ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. ఈ విధంగా ఎడమ ఉండటం వలన తల్లి మరియు బిడ్డలు పౌష్టికాహార లోపం మరియు రక్తహీనత నివారించవచ్చునని తెలిపారు. ఒకవేళ బిడ్డకు బిడ్డకు ఎడం పాటించకపోయినట్లయితే తక్కువ బరువు గల. నెలలు నిండని. అవయవ లోపం గల బిడ్డలు పుట్టుటకు అవకాశం ఉందని తెలిపారు. తల్లికి అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ అని . మరియు కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. గర్భనిరోధకాలు కేవలం భార్య కాకుండా భర్త కూడా పాటించి బాధ్యత తీసుకున్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని పెంపొందించిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాఘవ ,ఆరోగ్య కార్యకర్తల భీమేశ్వరి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.