పాఠశాలలు ఆకస్మిక తనిఖీ : డీఈవో
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల :మండల కేంద్రమైన గోనెగండ్ల లోని కురువపేట మండల పరిషత్ పాఠశాలను, మండల పరిధిలోని హెచ్ కైరవాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రంగారెడ్డి, మండల విద్యాధికారి వినోద్ కుమార్ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వర్క్ బుక్స్ విద్యార్థులతో రాయిస్తున్నారా లేదా, ఉపాధ్యాయులు డైరీలు రాస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదవడం రాయడం రావాలని వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, మధ్యాహ్న భోజనం సరిగా చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని, ముందుగా నోటీసులు ఇచ్చి , అనంతరం తీసివేసేందుకు కూడా వెనకాడమని అన్నారు. అలాగే సంక్రాంతి సెలవులు 12వ తేదీ నుండి 18 వరకు ఉంటాయని ఈ సెలవు దినాల్లో విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వాలని అన్నారు. అలాగే గోనేగండ్ల మండలానికి పీఎం శ్రీ పథకం కింద రెండు పాఠశాలలు ఎంపికయ్యాయని, ఎంపికైన పాఠశాలల్లో డిజిటలైజేషన్ విద్య అభివృద్ధి కోసం అలాగే ఇన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి వివిధ అంశాలు విద్యార్థులకు బోధిస్తామని అన్నారు. అలాగే గతేడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం జిల్లాలోనే గోనెగండ్ల మండలం తక్కువ స్థాయిలో ఉందని,ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల పాస్ ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకోసం జిల్లా ఉన్నతాధికారులుగా మేము, మండల విద్యాధికారులుగా ఎంఈఓ , ఉపాధ్యాయులు అందరం కలిసి మా వంతు సహకారం అందించి పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామన్నారు.