వీధి బాలల నిర్మూలనకై ఆకస్మిక తనిఖీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారి ఆద్వర్యంలో వీధి బాలలను గుర్తించడానికి ప్రత్యక్షంగా కదం కదిపారు. సంబంధిత కార్మిక శాఖ అధికారులు, డి.సి.పి.ఓ. గారు, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్, జాతీయ బాల శ్రమ ప్రాజెక్ట్, కర్నూలు, జిల్లా ప్రొబేషనరీ అధికారి, కౌన్సెలర్, చైల్డ్ లైన్ వారు, సివిల్ సొసైటీ వారు, పోలీసు, జువెనైల్ సంక్షేమం మొదలైన అధికారుల సహకారంతో కర్నూలు పట్టణంలో బృందంగ వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాడానికి సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. సిటీ లిమిట్స్ లోని సి. కాంప్ సెంటర్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు మరియు బళ్ళారి చౌరస్తా నుండి అమిలియా హాస్పిటల్ వరకు వున్న ప్రదేశాలలో 10 మంది వీధి బాలలను గుర్తించడం జరిగిందన్నారు. అనంతరము జిల్లా బాలల సంక్షేమ సమితి ముందు కౌన్సెలింగ్ చేసి వారిని కొంతమందిని వారి కుటుంబ సభ్యులను గుర్తించి వారి కుటుంబ సభ్యులతో కలపడం మరియు వారు విద్యను అభ్యసించడం కోసం సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సంబందిత శాఖ వారందరూ పాల్గొనారు.