రంకేసిన బుల్.. లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధి రేటు నమోదవ్వొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. అటు అంతర్జాతీయంగా సూచీలు సానుకూలంగా కదలడం కూడ కలిసొచ్చింది. రేపు బడ్టెట్ పై సానుకూలంగా ఉన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అన్ని రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 813 పాయింట్ల లాభంతో 58,014 వద్ద ముగిసింది. నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,339 వద్ద ముగిసింది.