బాలిక పై అత్యాచారం.. జూబ్లీహిల్స్ లో ఆందోళన
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అమినీషియా పబ్‌కు వెళ్లిన బాలిక అత్యాచారానికి గురైన కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్‌లోకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిందితులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఉన్న అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్లింది. పార్టీ అనంతరం బయటకు వచ్చి స్నేహితులతో కలిసి కాసేపు జూబ్లీహిల్స్ రోడ్డలపై తిరిగి ఇంటికి వెళ్లింది. అయితే, ఆమె మెడపై గాయాలు ఉండడాన్ని గమనించిన తండ్రి ఆరా తీశాడు. ఆపై ఆమె చెప్పింది విని షాకయ్యాడు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో ఉన్న కొంతమంది అబ్బాయిలు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.