PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడాదిన్నర పాప పై అత్యాచారం.. యూపీలో దారుణం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: యూపీలో బ‌హ్రెయిచ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఏడాదిన్నర ప‌సిపాప పై ఓ యువ‌కుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బ‌హ్రెయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్రకారం.. బ‌హ్రెయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాదిన్నర వ‌య‌సు ఉన్న చిన్నారి త‌ల్లిదండ్రుల‌తో పాటు నిద్రిస్తోంది. ముప్పై ఏళ్ల యువ‌కుడు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి… స్థానిక ప్రభుత్వ పాఠ‌శాల‌లో అత్యాచారం చేశాడు. త‌ల్లిదండ్రులు నిద్రలేచే స‌రికి పాప క‌నిపించ‌క‌పోవ‌డంతో… గ్రామ‌స్థుల‌తో క‌లిసి వెతికారు. ప్రభుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఆ చిన్నారి ర‌క్తస్రావంతో అచేత‌నంగా ప‌డి ఉంది. ఈ దృశ్యం చూసిన త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఘ‌ట‌న‌కు పాల్పడిన యువ‌కుడిని పోలీసుల‌కు అప్పగించారు. కోర్టుకు తీసుకెళ్తుండ‌గా.. ఆ యువ‌కుడు పారిపోయేందుకు య‌త్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. అత‌ని కాలికి గాయ‌మై.. కుప్పకూలాడు. వెంట‌నే పోలీసులు అదుపులోకి తీసుకుని .. ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్షల అనంత‌రం కోర్టులో హాజ‌ర‌ప‌రిచారు.

About Author