PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు న‌టి పై అత్యాచారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆదిత్యకపూర్ ఓ తెలుగునటిపై అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్యకపూర్ పలుసార్లు అత్యాచారం చేశాడని, అనంతరం వివాహం చేసుకునేందుకు నిరాకరించాడని తెలుగునటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకోవాలని అడిగితే ఆదిత్య కపూర్ తనను దూషించి కొట్టాడని తెలుగునటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన అశ్లీల చిత్రాలు నిందితుడి వద్ద ఉన్నాయని వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని తెలుగునటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

                                              

About Author