‘అమీలియో’లో అరుదైన వైద్యం..
1 min readమూత్ర సంచిలో 95 రాళ్ల తొలగింపు
పల్లెవెలుగు వెబ్: కర్నూలు అమీలియో ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి… రికార్డు సృష్టించారు. 89 ఏళ్ల వృద్ధుడి మూత్ర సంచిలో 95 రాళ్లు తొలగించారు. వివరాలు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనహాయి గ్రామానికి చెందిన శేషిరెడ్డి(89) మూత్రంలో విపరీతమైన మంట, మూత్రం రాకపోవడం వలన గత నెల 16న అమీలియో ఆస్పత్రిని సంప్రదించారు. మూత్రశయ పరీక్షలు నిర్వహించిన మూత్రశయ వ్యాధి నిపుణులు డా. ఆర్. సతీష్ కుమార్ మూత్రసంచిలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కోత పరీక్ష ద్వారా శస్ర్తచికిత్స నిర్వహించి.. 95 రాళ్లు, పొడి తొలగించినట్లు డా.ఆర్. సతీష్ కుమార్ వెల్లడించారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డా. ఆర్. సతీష్ కుమార్ను, వైద్య బృందాన్ని అభినందించారు అమీలియో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండి. డా. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో కిడ్నీకి సంబంధించిన డయాలసిస్, డిజెస్టంట్ మరియు ఇతరత్ర వైద్యసేవలు, శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ కింద చేస్తామని, కర్నూలు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.