PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ గౌరీగోపాల్​’లో అరుదైన గుండె ఆపరేషన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రపంచంలోనే అరుదైన శస్తచికిత్స చేశారు కర్నూలు గౌరీగోపాల్​ ఆస్పత్రి వైద్యులు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. లక్ష్మణ స్వామి మాట్లాడారు. కడప జిల్లాకు చెందిన గౌస్​ మొహిద్దీన్​ అనే వ్యక్తి రెండు నెలల నుంచి ఆయాసంతో బాధపడుతుండేవాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించే గౌస్​ మొహిద్దీన్​కు పొగాకు నమిలే అలవాటు ఉండటంతో హార్ట్​ ఎటాక్​ వచ్చింది. ఈ క్రమంలో వైద్యచికిత్స కోసం గౌరీ గోపాల్​ ఆస్పత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్ష, వైద్యపరీక్షల అనంతరం గౌస్​ మొహిద్దీన్​కు మీసో కార్డియా అనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు కూడా ఉందని నిర్ధారించాం. మీసో కార్డియా వల్ల గుండె ఎడమ వైపు తిరిగి.. ఛాతి మధ్యలో ఉంటుంది. దీని వల్ల గుండె వంకరగా తిరిగి ఉంటుంది. ఇటువంటి గుండెకు బైపాస్​ సర్జరీ 2016లో మాత్రమే జరిగింది. గౌస్​ మొహిద్దీన్​ గుండెకు హార్ట్​ క్యాబ్స్​ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశాం. ఇది ప్రపంచంలోనే రెండవ కేసుగా సగర్వంగా చెబుతున్నాం. సమావేశంలో గౌరిగోపాల్​ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author