కర్నూలు ‘కిమ్స్’లో అరుదైన గుండె శస్త్ర చికిత్స
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న యువతికి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి ప్రాణాలు కాపాడారు. అనంతపురం జిల్లా.. మోమినాబాద్‌కు చెందిన గృహిణి షేక్ జబీనా తబస్సుమ్(22) అనే మహిళ వారం రోజుల నుంచి ఛాతి, వెన్నునొప్పితో బాధపడుతూ రెండు నెలలుగా ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతోంది. కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వాల్వ్యులర్ గుండె వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కిమ్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలీసౌదగర్, అనస్థీషియా డాక్టర్ విజయసాయి సహకారంతో గుండె శస్ర్తచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్స అనంతరం పేషెంట్‌ను 8 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి ఆమె దినచర్యలు సక్రమంగా చేసుకుంటూ హుషారుగా ఉండటంతో డిశ్చార్జి చేసినట్లు కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కె. సందీప్ రెడ్డి తెలిపారు. జబీనా తబుస్సమ్ ప్రాణాలు కాపాడిన కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లకు, వైద్యసిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.