NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీలియో లో ఆరోగ్యశ్రీ క్రింద అరుదైన గుండె చికిత్స

1 min read

పల్లెవెలుగు కల్లూరు అర్బన్ : న్యూమోనియా మరియు హార్ట్ టాక్ వచ్చిన ఓ రోగికి కర్నూలు అమీలియో హాస్పిటల్ వైద్యులు ఆరోగ్యశ్రీ క్రింద అరుదైన గుండె చికిత్స అందించి ప్రాణాన్ని కాపాడారు. కొసిగి మండలం ఐరంగళ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఈరన్న ఈ నెల 21న విపరీతమైన ఆయాసము, దగ్గుతో అమీలియో హాస్పిటల్ సంప్రదించారు. ఆ సమయంలో రోగికి ఆక్సిజన్ శాతం. బి.పి. శాతం తక్కువగా ఉండటంతో రోగిని పరీక్షించగా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నట్లు గుర్తించారు మరియు కార్డియాలజిస్టు డా. భూపాల్ మరియు డా. విజయలక్ష్మీ నేతృత్వంలో అంజియోగ్రామ్ నిర్వహించగ అతని ఎడమ దమని (Left Main Artery) 99 శాతం బ్లాక్ అయినట్లు గుర్తించారు. ఈ నెల 23న ఆరోగ్యశ్రీ క్రింద రెండు రక్తనాళాలకు స్టంట్ వేసి రోగి ప్రాణాన్ని కాపాడారు. బుధవారం రొగి డిచ్చార్జ్ అవుతున్న సందర్భమున అమీలియో హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. భూపాల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రోగికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని. అయితే రోగికి ఊపిరితిత్తుల్లో అత్యధిక మొతాదులో నిమ్ము ఉండటం వలన ఆపరేషన్ కష్టమౌతుందని రెండు స్టంట్లు వేసి రోగికి అరుదైన గుండె చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడామన్నారు. ఇప్పుడు రోగి యొక్క ఆక్సిజన్ శాతం, బి.పి. శాతం మెరుగుపడి ఆరోగ్యంతో డిచ్చార్జ్ అవుతున్నారన్నారు. రోగి తమ్ముడు మాట్లాడుతూ మా అన్న క్లిష్టపరిస్థితిని గమనించి ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడినందుకు హాస్పిటల్ యాజమాన్యమునకు, డా. భూపాల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

                            

About Author