లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం
1 min read
ఇరాన్ దేశానికి చెందిన యు .ఎన్. సి డబ్ల్యూ. పి అంతర్జాతీయ సంస్థ నుంచి
హ్యూమాని టేరియన్ అంతర్జాతీయ అంబాసిడర్ గా గుర్తింపు
కర్నూలు, న్యూస్ నేడు: ఇరాన్ దేశానికి చెందిన యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ వరల్డ్ పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి అంతర్జాతీయ హ్యూమాని టేరియన్ అంబాసిడర్ గా గుర్తింపు సర్టిఫికెట్ ను నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అంబాసిడర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అంతర్జాల సదస్సులో అందజేసింది. ఈ అరుదైన గౌరవం దక్కడం ఎంతో గర్వకారణంగా ఉందని మానవ హక్కులు, ప్రపంచశాంతి మహిళా సాధికారికత ,సాంస్కృతి సంప్రదాయాలపై అంతర్జాతీయ సంస్థలు వివిధ దేశాల ప్రతినిధులతో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులలో భాగస్వామ్యం కావడం వల్ల ఈ అరుదైన గౌరవం దక్కడం మరింత సామాజిక సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చిందని రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.