NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైల వాసవి సత్రంకు.. అరుదైన గౌరవం…

1 min read

పల్లెవెలుగు వెబ్​: 60 సంవత్సరాల కిందట  భక్తులకు వసతి అన్నదానం సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో వ్యవస్థాపకులు మూర్తి వెంకటేశ్వర్లు స్థాపించబడిన ఈ వాసవి సత్రం సముదాయాలకు దేశంలోనే క్వాలిటీ ఫుడ్ మరియు ఇన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా  సేవలు అందిస్తున్నందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ వారిచే కమిట్మెంట్ సర్టిఫికెట్ లభించింది ఈ సర్టిఫికెట్ అందించడానికి వచ్చిన భారతదేశ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రెటరీ డి. ఆర్ .ఉల్లాజి ఇలియాజర్ మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం మొదటిదని  వాసవి సత్రం సముదాయానికి అని ఆయన అన్నారు అనంతరం సర్టిఫికెట్ అందుకున్న వాసవి సత్రం సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా యొక్క సేవలను గుర్తించి ఈ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషమని దీనికి మా సత్రం కమిటీ సభ్యులు స్టాఫ్ సహకరిస్తున్న దాతల కృషి వల్లనే ఈ సర్టిఫికెట్ వచ్చింది అన్నారు ఇక ముందు  కూడా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఇంకా పుణ్యక్షేత్రాల్లో వాసవి సత్రం సముదాయాలను నెలకొల్పి దాని ద్వారా భక్తులకు సేవలందిస్తా మని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం మరియు సుండిపెంట ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

About Author